- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PARIS OLYMPICS : ప్రీ - క్వార్టర్‌ఫైనల్‌లో పురుషుల టీమ్ ఓటమి
దిశ, వెబ్‌డెస్క్ : పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల టేబుల్ టెన్నిస్ టీం కథ ముగిసింది. ఈ రోజు జరిగిన ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌లో భారత్ 0-3 తేడాతో నెంబర్ వన్ టీం చైనా చేతిలో ఓడిపోయింది. అచంత శరత్ కమల్, మానవ్ థక్కర్, హమిత్ దేశాయ్ కూడిన భారత త్రయం చైనా క్రీడాకారులకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో టీం ఇండియా క్వార్టర్ ఫైనల్ కు చేరుకోలేకపోయింది.
కాగా.. మొదటి సింగిల్స్‌లో ఒలింపిక్ ఛాంపియన్ ఫ్యాన్ జెండాంగ్‌తో పోటీ పడిన శరత్ తన అద్భుతమైన ప్రదర్శనతో మొదటి గేమ్‌ను 11-9తో చేజిక్కించుకున్నాడు.కానీ తర్వాతి మూడు గేమ్‌లలో జెండాంగ్ 11-7 11-7 11-5 తేడా తో శరత్ ను ఓడించాడు. ఆ తరువాత జరిగిన డబుల్స్ మ్యాచులో భారత ద్వయం హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్ 2-11 3-11 7-11 తేడాతో చైనా జంట మా లాంగ్-చుకిన్ వాంగ్ చేతిలో ఓడిపోయారు. దీంతో భారత్ 0-2తో వెనుకబడిపోయింది.ఫైనల్ గా రెండో సింగిల్స్ మ్యాచులో 24 ఏళ్ల మానవ్ 9-11 6-11 9-11 తేడాతో చుకిన్‌పై ఓడిపోయాడు.పురుషుల టీం ఇంటిముఖం పట్టడంతో ఇప్పుడు భారత ఆశలన్నీ మహిళల టీంపైనే ఉన్నాయి. కాగా సోమవారం మనిక బాత్రా, శ్రీజ అకుల మరియు అర్చన కామత్‌లతో కూడిన భారత మహిళల జట్టు, ఉత్కంఠభరితమైన మ్యాచులో 3-2 తేడాతో మనకన్నా మెరుగైన ర్యాంకున్న రొమేనియాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.