Paris Olympics: భారత కీలక హాకీ ప్లేయర్ పై మ్యాచ్ నిషేధం.. సెమీస్‌కు దూరం

by Mahesh |
Paris Olympics: భారత కీలక హాకీ ప్లేయర్ పై మ్యాచ్ నిషేధం.. సెమీస్‌కు దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్యారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచులో బ్రిటన్‌తో తలపడింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఫైనల్ షూటౌట్ లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత జట్టు సెమీస్ కు చేరుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ నియామావళి ఉల్లఘించాడని.. భారత ఆటగాడు అమిత్ రోహిదాస్‌పై హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఒక మ్యాచ్ నిషేధాన్ని విధించింది. దీంతో అతను త్వరలో జరగబోయే సెమీస్ మ్యాచ్ కి దూరం కానున్నాడు. అయితే హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై భారత జట్టు అసహనంగా ఉంది. దీంతో మరోసారి రోహిదాస్‌పై విదించిన బ్యాన్ పై పూనరాలోచించాలని.. హాకీ ఇండియా ఆపిల్ చేసుకుంది. దీనిపై హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed