- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ధోనిపై కీలక వ్యాఖ్యలు చేసిన పాండ్య.. నా కెరీర్ ఇలా కావడానికి కారణం అంటూ..
by D.Reddy |

X
దిశ, వెబ్‌డెస్క్: మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ది్క్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' ధోని బాయ్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. గ్రౌండ్‌లో ఆటగాళ్ల ప్రతి కదలికను గమనించి.. వారికి అవసరమైన సలహాలు ఇస్తారు. అంతే కాకుండా ప్లేయర్లను స్వేచ్చగా వదిలేస్తారు. క్లిష్ట సమయాల్లో ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోని బాయ్ ఎప్పుడూ ముందుంటారు. ధోని లేకుంటే నా కెరీర్ ఆరంభంలోనే ముగిసేది. కెరీర్ మొదట్లో నాకు ఎన్నో కీలక సలహాలు ఇచ్చి.. బాసటగా నిలిచారని పాండ్య తెలిపాడు. ఒత్తిడి సమయాలలో కీలక సలహాలు ఇచ్చాడని' పేర్కొన్నాడు. కాగా గత కొన్ని నెలలుగా పాండ్య ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్‌లో ఈ స్టార్ ఆల్ రౌండర్ నూతనంగా వచ్చిన గుజరాత్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Next Story