వరల్డ్ కప్‌కు ముందు పాక్‌ కీలక సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల

by Vinod kumar |
వరల్డ్ కప్‌కు ముందు పాక్‌ కీలక సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌-2024 కప్‌కు ముండు పాకిస్తాన్‌ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఈ మెగా టోర్నీకి ముందు పాక్‌ పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్‌ టీమ్‌తో తలపడనున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో వరుస సిరీస్‌లకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మే 22, 2024 నుంచి ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ పురుష జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. అంతకంటే ముందు మే 11 నుంచి మహిళా జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్‌ సమరం మొదలుకానుంది. ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ వుమెన్‌ టీమ్‌లు మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఇంగ్లండ్‌లో పాకిస్తాన్‌ పర్యటన-2024 పూర్తి వివరాలు

మహిళా జట్ల టీ20, వన్డే సిరీస్‌

తొలి టీ20 మే 11- ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హాం

రెండో టీ20 మే 17- ది కౌంటీ గ్రౌండ్‌, నార్తాంప్టన్‌

మూడో టీ20 మే 19- హెడ్డింగ్లీ, లీడ్స్‌

మొదటి వన్డే మే 23- డెర్బీ

రెండో వన్డే మే 26- టాంటన్‌

మూడో వన్డే మే 29- చెల్మ్స్‌ఫోర్డ్‌

ఇంగ్లండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మెన్స్‌

నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌

తొలి టీ20- మే 22- హెడ్డింగ్లీ, లీడ్స్‌

రెండో టీ20- మే 25- ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హాం

మూడో టీ20- మే 28- సోఫియా గార్డెన్స్‌, కార్డిఫ్‌

నాలుగో టీ20- మే 30- ది ఓవల్‌, లండన్‌.

Advertisement

Next Story

Most Viewed