- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ సహా మరో కీలక జట్టు ఔట్

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నుంచి రెండు కీలక జట్లు ఇంటి బాట పడ్డాయి. గ్రూపు-Aలో కొనసాగుతున్న ఆతిథ్య పాకిస్తాన్(Pakistan) జట్టు, బంగ్లాదేశ్(Bangladesh) జట్టు టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించాయి. లీగ్ దశలో ఉండే మూడు మ్యాచుల్లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన జట్లు(India, New Zealand)లు సెమీస్‌కు చేరగా.. వరుసగా రెండేసి మ్యాచులు ఓడిపోయిన పాక్, బంగ్లా జట్లు వెనుదిరిగాయి. తాజాగా.. ఇవాళ్టి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కివీస్ విక్టరీ సాధించింది.
ముందుగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో(77), జాకెర్ అలీ (45), రిషాద్ హొస్సేన్ (26), తంజిద్ హసన్ (24) సహా మిగిలిన ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో మొత్తంగా మోహదీ హసన్ మిరాజ్ (13), టస్కిన్ అహ్మద్ (10), తౌహిద్ (7), ముష్ఫికర్ రహీమ్ (2), మహ్మదుల్లా (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.
237 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ వచ్చిన కివీస్ ప్లేయర్లలో కాన్వే(30), రచిన్ రవీంద్ర(112), టామ్ లాథమ్(55), గ్లెన్ ఫిలిప్స్(21)లు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో కివీస్ సునాయాసంగా సెమీస్‌కు చేరింది.