Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో ఒక కోటి ధర...అసియా కప్ లో ఒక పరుగు

by Y. Venkata Narasimha Reddy |
Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో ఒక కోటి ధర...అసియా కప్ లో ఒక పరుగు
X

దిశ, వెబ్ డెస్క్ : వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఈ పేరు దేశ వాళీ జూనియర్ క్రికెట్ లో సుపరిచితం. అండర్-19 టెస్టుల్లో సూర్యవంశీ అత్యంత వేగంగా సెంచరీ సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అక్టోబర్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లోనే అతడు శతకం నమోదు చేశాడు. ఐపీఎల్ వేలంలో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌లో ఆడనున్న అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. 13ఏళ్లకే కోటీశ్వరుడైన వైభ‌వ్‌.. పాక్‌తో జ‌రుగుతున్న అండ‌ర్‌19 ఆసియాక‌ప్(Asia Cup Under-19) మ్యాచ్‌లో ఒక్క ప‌రుగుకే ఔట‌య్యాడు. 9 బంతులు ఆడిన వైభ‌వ్‌.. క్రీజ్‌లో నిల‌వ‌లేక‌ అవుటైపోయాడు. పాక్ స్పీడ్ బౌల‌ర్ అలీ రాజా బౌలింగ్‌లో క్యాచ్ అవుట‌య్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవ‌ర్లలో 281 ర‌న్స్ స్కోర్ చేసింది. షాజైబ్ ఖాన్ 159 ర‌న్స్ చేశాడు. ప్రస్తుతం ఇండియా జ‌ట్టు 10 ఓవ‌ర్లలె రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులతో ఆడుతూ లక్ష్య చేధనకు ఎదురీదుతోంది.

అక్టోబర్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లోనే అతడు శతకం నమోదు చేశాడు. ఐపీఎల్ వేలంలో సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌లో ఆడనున్న అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. 13ఏళ్లకే కోటీశ్వరుడైన వైభ‌వ్‌.. పాక్‌తో జ‌రుగుతున్న అండ‌ర్‌19 ఆసియాక‌ప్(Asia Cup Under-19) మ్యాచ్‌లో ఒక్క ప‌రుగుకే ఔట‌య్యాడు. 9 బంతులు ఆడిన వైభ‌వ్‌.. క్రీజ్‌లో నిల‌వ‌లేక‌ అవుటైపోయాడు. పాక్ స్పీడ్ బౌల‌ర్ అలీ రాజా బౌలింగ్‌లో క్యాచ్ అవుట‌య్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవ‌ర్లలో 281 ర‌న్స్ స్కోర్ చేసింది. షాజైబ్ ఖాన్ 159 ర‌న్స్ చేశాడు. ప్రస్తుతం ఇండియా జ‌ట్టు 10 ఓవ‌ర్లలె రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులతో ఆడుతూ లక్ష్య చేధనకు ఎదురీదుతోంది.

Advertisement

Next Story

Most Viewed