- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్డే వరల్డ్ కప్.. ఇండియా vs పాక్ మ్యాచ్‌పై క్లారిటీ..!
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో భారత్ ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడనుంది, చిరకాల ప్రత్యర్థులు పాక్, భారత్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరగనుంది.. వంటి ఆసక్తికర విషయాలు పలు జాతీయ వెబ్‌సైట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. క్రిక్ బజ్‌లో వచ్చిన కథనం ప్రకారం.. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ప్రారంభ మ్యాచ్ గత టోర్నీ ఫైనలిస్టుల మధ్య జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఫస్ట్ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరుగనున్నట్లు క్రిక్ బజ్ తెలిపింది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న (ఆదివారం) జరుగనున్నట్టు సమాచారం.
వరల్డ్ కప్‌ను అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ధర్మశాల, ముంబై, రాజ్‌కోట్, గువహతి, రాయ్‌పూర్, హైదరాబాద్ వంటి నగరాలలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. అయితే తుది షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఐపీఎల్ -16 ముగిసిన వెంటనే ఇది వెలువడే అవకాశం ఉంది.