ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ జరీన్ శుభారంభం

by Harish |
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ జరీన్ శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్తాన్‌లో జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో వరల్డ్ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 52 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఆమె సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో విజయం సాధించింది. కజకిస్తాన్‌ బాక్సర్ రఖైంబర్డి ఝన్సయను 5-0 తేడాతో చిత్తు చేసింది. బౌట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకపడింది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నిఖత్ జరీన్‌తోపాటు మీనాక్షి, అనామిక రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 48 కేజీల కేటగిరీలో మీనాక్షి 4-1 తేడాతో గాసిమోవా రోక్సానా(కజకిస్తాన్)ను ఓడించగా.. 50 కేజీల కేటగిరీలో కజకిస్తాన్‌కే చెందిన జుమాబయేవా అరైలిమ్‌ను అనామిక మట్టికరిపించింది. ఇష్మీత్ సింగ్(75 కేజీలు), సోనియా(54 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశపరిచారు. స్టార్ బాక్సర్ శివ థాపా(63.5 కేజీలు), సంజయ్(80 కేజీలు), గౌరవ్ చాహౌన్(92+ కేజీలు)లతోపాటు మరో ముగ్గురు భారత బాక్సర్లు నేడు తొలి రౌండ్‌లో పోటీపడనున్నారు.

Advertisement

Next Story

Most Viewed