- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంచలన నిర్ణయం తీసుకున్న న్యూజిలాండ్ స్టార్ పేసర్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ టెస్టు స్పెషలిస్ట్ పేసర్ నీల్ వాగ్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు మంగళవారం వెల్లడించాడు. దీంతో తన 12 ఏళ్ల సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకోలేదని, కానీ సరైన సమయమిదే అని తెలిపాడు. ‘ బ్లాక్ క్యాప్స్ తరపున టెస్టు క్రికెట్‌ను ప్రతి క్షణం ఆస్వాదించాను. మేము జట్టుగా సాధించిన ప్రతి విజయం పట్ల గర్వపడుతున్నా. ఇది ఎమోషనల్ వీక్. క్యాంప్‌లో చివరి వారం ఎలా గడుస్తుందోనని ఎదురుచూస్తున్నా. ఈ సిరీస్‌లో కుర్రాళ్లకు మద్దతు ఇవ్వడానికి, వారిని సిద్ధం చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తా.’ అని వాగ్నర్ చెప్పుకొచ్చాడు. అయితే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అతన్ని పక్కనపెట్టినట్టు టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి సమాచారం అందడంతోనే వాగ్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వాగ్నర్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంగా 64 టెస్టుల్లో అతను 52 స్ట్రైక్ రేట్‌తో 260 వికెట్లు తీసుకున్నాడు. కివీస్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వాగ్నర్ ఐదో స్థానంలో ఉన్నాడు. దిగ్గజ బౌలర్ సర్ రిచార్డ్ హార్డ్లీ(431), టీమ్ సౌథీ(376), డేనియల్ వెట్టోరి(361), ట్రెంట్ బౌల్ట్(317) అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. 2021లో ప్రారంభ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలిచిన జట్టులో వాగ్నర్ సభ్యుడు.