హైదరాబాద్‌లో న్యూజిలాండ్ టీం ప్రాక్టీస్ రద్దు

by Nagaya |
హైదరాబాద్‌లో న్యూజిలాండ్ టీం ప్రాక్టీస్ రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నెషన్ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌‌ ఆడేందుకు నిన్న నగరానికి కివీస్ టీం వచ్చిన సంగతి తెలిసిందే. తాజ్‌కృష్ణ హోటల్‌లో బస చేస్తున్న న్యూజిలాండ్ టీంకు నేడు ప్రాక్టీస్ జరగాల్సి ఉండగా అది కాస్త రద్దైంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఉన్నందున స్టేడియం సిబ్బందికి సెలవులు కావడంతో మ్యాచ్ ప్రాక్టీస్ ను రద్దు చేశారు. రేపటి నుంచి ప్రాక్టీస్ ప్రారంభం అవుతుందని తెలిపారు. రేపు నగరానికి టీమిండియా రానుంది. శ్రీలంకతో నేడు మ్యాచ్ పూర్తి చేసుకుని జనవరి 18న హైదరాబాద్ లో జరగబోయే ఆటకు రేపు ఆటగాళ్లు విచ్చేయనున్నారు. రేపటి నుంచి ఇరు జట్లకు ప్రాక్టీస్ ప్రారంభంకానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed