T20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన New Zealand..

by Satheesh |   ( Updated:2022-09-20 10:57:27.0  )
T20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన New Zealand..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. ఇటీవల కివీస్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించిన యంగ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్, సీనియర్ బౌలర్ బోల్ట్ కూడా టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక, న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ మరోసారి ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో గుప్టిల్ వరుసగా ఏడో టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు.

T20 ప్రపంచ కప్ న్యూజిలాండ్ జట్టు:

కేన్ విలియమ్సన్ (సి), టిమ్ సౌథీ, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, మార్టిన్ గప్టిల్, లాకీ ఫెర్గూసన్, డెవాన్ కాన్వే, మైఖేల్ చాప్‌వెల్, ట్రెంట్ బౌల్ట్, ఫిన్ అలెన్.

Advertisement

Next Story