బాబర్ రాజీనామా ఎఫెక్ట్.. పాకిస్తాన్‌ జట్టుకు కొత్త కెప్టెన్

by GSrikanth |
బాబర్ రాజీనామా ఎఫెక్ట్.. పాకిస్తాన్‌ జట్టుకు కొత్త కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్‌లో ఓటమికి సంపూర్ణ బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి పాకిస్తాన్ కీలక ప్లేయర్ బాబర్ అజామ్ రాజీనామా చేశారు. తాజాగా.. జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటిచింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భాగంగా మంగళవారం పీసీబీ జట్టును ప్రకటించింది. ఇందులో కెప్టెన్‌గా షాన్ మసూద్, అర్బర్ అహ్మద్, హాసన్ అలీ, మీర్ హంజా, నోమన్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్, ఆమీర్ జమాల్, బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ రిజ్వాన్, అయూబ్, షకీల్, షఫీక్, అష్రఫ్, షాజాద్, జూనియర్ వసీమ్, అలీ అఘా, షహీన్ ఆఫ్రీదీలను బోర్డు ఎంపిక చేసింది. కాగా, పాకిస్తాన్ WTCలో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Advertisement

Next Story