నేపాల్ క్రికెటర్లకు భారత్ లో శిక్షణ

by M.Rajitha |
నేపాల్ క్రికెటర్లకు భారత్ లో శిక్షణ
X

దిశ, వెబ్ డెస్క్ : నేపాల్ క్రికెట్ జట్టుకు బీసీసీఐ మరోసారి సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనేందుకు నేపాల్ జట్టుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అందులో భాగంగా నేపాల్ జట్టు భారత్ లో పర్యటించనుంది. కాగా ఈ జట్టు భారత్ లో పర్యటించడం ఇది రెండవసారి. గతంలో నేపాల్.. గుజరాత్, బరోడాతో జరిగిన ముక్కోణపు సిరీస్ లో పాల్గొనడానికి భారత్ కు రాగా, ప్రస్తుతం ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 కోసం సన్నాహక మ్యాచ్ లు ప్రాక్టీస్ చేసుకోవడానికి బెంగుళూర్ శిక్షణా శిబిరాన్ని ఉపయోగించుకోనుంది. బీసీసీఐ చేసిన ఈ సహాయానికి నేపాల్ జట్టు కృతజ్ఞతలు తెలిపింది. అయితే కేవలం నేపాల్ కు మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్ కు సైతం ఇలాంటి సహాయన్నే అందించింది బీసీసీఐ. ఆఫ్ఘన్- సౌత్ ఆఫ్రికా ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇండియాలో ఆడుకొమ్మని బీసీసీఐ అనుమతినిచ్చింది. ఇది రానున్న అక్టోబర్లో జరగనుంది.

Advertisement

Next Story