Nithya menen: అందుకే ఆమె బయోపిక్‌లో నటించలేదు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-01-22 09:22:23.0  )
Nithya menen: అందుకే ఆమె బయోపిక్‌లో నటించలేదు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నిత్యామీనన్(Nithya Menen) గురించి స్పెషల్‌గాా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi ) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే సింగర్‌గా కూడా కొన్ని సాంగ్స్ పాడింది. ఇక ఈ బ్యూటీ... ‘తిరుచిత్రంబలం’(Thiruchitrambalam) మూవీకి ఏకంగా జాతీయ అవార్డును అందుకుని ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ‘కాదలిక్క నేరమిల్లై’(Kadhalikka Neramillai) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా జనవరి 14న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. “జయలలిత(Jayalalitha) బయోపిక్ చేయాలని మేము ఎంతగానో ఆశపడ్డాము. చర్చలు కూడా జరిగాయి. మా సినిమా ప్రకటించిన తర్వాత అదే కథతో ‘తలైవి’(Thalaivi) చిత్రం వచ్చింది. మళ్లీ మూవీ చేస్తే రిపీట్ అవుతుందనిపించింది. మా నాన్న మాత్రం తప్పకుండా ఈ సినిమాలో యాక్ట్ చేయమని కోరారు. కొంత కాలానికి ‘క్వీన్’(QUEEN) పేరిట ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అలా, ఒకే కథపై రెండు ప్రాజెక్టులు విడుదలయ్యాక మేము సినిమా చేస్తే రిపీట్ చేసినట్లు అవుతుందని భావించా.

అందుకే ఆ సినిమా పక్కన పెట్టేశా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా నిత్యామీనన్ హీరోయిన్‌గా ప్రియదర్శిని(Priyadarshini) అనే యంగ్ డైరెక్టర్ జయలలిత బయోపిక్ చేస్తున్నట్లు 2019లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ది ఐరన్ లేడీ’(The Iron Lady) అంటూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.



Next Story

Most Viewed