భారీ బందోబస్తు నడుమ వరుడి ఊరేగింపు.. భద్రత కోసం ఏకంగా 400 మంది పోలీసులు

by Ramesh Goud |
భారీ బందోబస్తు నడుమ వరుడి ఊరేగింపు.. భద్రత కోసం ఏకంగా 400 మంది పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్(Rajastan) లోని అజ్మీర్ జిల్లా(Ajmir District)లో ఓ పెళ్లి కొడుకు ఊరేగింపు భారీ బందోబస్తు(heavy security) నడుమ గుర్రంపై జరిగింది. వరుడి భద్రత కోసం పోలీస్ శాఖ ఏకంగా 400 మంది పోలీసులను నియమించింది. శ్రీనగర్ బ్లాక్(Srinagar block) లోని లవేరా గ్రామానికి(Lavera village) చెందిన మోహన్ బకోలియా కుమారుడు లోకేష్ కి రాయిగర్ గ్రామానికి చెందిన నారాయణ్ ఖోర్వాల్ కుమార్తె అరుణతో వివాహం నిశ్చయమైంది. వివాహ ఊరేగింపులో భాగంగా వరుడు గుర్రంపై స్వారీ(Horse Ride) చేసుకుంటూ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. దీనిని స్థానిక అగ్రవర్ణ కులస్థులు వ్యతిరేకించారు.

దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై వధువు తండ్రి అభ్యర్థన మేరకు పోలీసులు వరుడికి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో 400 మంది పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ పెళ్లికొడుకు గుర్రపు స్వారీ చేసుకుంటూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. దీనిలో ఎటువంటి వివక్ష నివేదించబడలేదని, ఫిర్యాదు మాత్రం అందిందని తెలిపారు. అంతేగాక పెళ్లికుమారుడి భద్రత దృష్యా బందోబస్తు ఏర్పాటు చేశామని, దీనితో ప్రజల్లో సమాజిక అవగాహన పెంపొందుతుందని ఆశించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై వధువు తండ్రి నారాయణ్ మాట్లాడుతూ.. సమాజంతో మాకు భయం ఉందని, అందుకే భద్రత కోసం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. అంతేగాక యువత, విద్యావంతులు మాత్రమే వివక్షను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.



Next Story

Most Viewed