స్వర్ణం గెలవనందుకు క్షమాపణలు చెప్పిన నీరజ్

by Harish |
స్వర్ణం గెలవనందుకు క్షమాపణలు చెప్పిన నీరజ్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన అతను ఈ సారి కూడా బంగారు పతకమే గెలుస్తాడని అభిమానులు ఆశించారు. అయితే, నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ రజతంతోనే సరిపెట్టాడు. తాజాగా గోల్డ్ మెడల్ గెలవకపోవడంపై నీరజ్.. అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

ఓ కార్యక్రమంలో అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీరజ్ మాట్లాడుతూ.. ‘చెప్పడానికి పెద్దగా ఏం లేదు. కానీ, మీకు చూపించడానికి సిల్వర్ మెడల్ తెచ్చాను. స్వర్ణం గెలవలేదు. అక్కడ జాతీయ గీతం వినిపించలేదు. క్షమించండి. నేను అనుకున్నది జరగలేదు. కానీ, పతకం పతకమే. ఎంతో కష్టపడ్డాను. దేశానికి పతకం గెలవడం భిన్నమైన అనుభూతి.’ అని చెప్పాడు. కాగా, జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ 59.45 మీటర్ల ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 9297 మీటర్ల త్రోతో స్వర్ణం గెలుచుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed