- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ క్వాలిఫై
దిశ, స్పోర్ట్స్ : డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. బెల్జియంలోని బ్రస్సెల్స్ వేదికగా ఈ నెల 13, 14 తేదీల్లో ఫైనల్ ఈవెంట్ జరగనుంది. డైమండ్ లీగ్ స్టాండింగ్స్‌లో నీరజ్ టాప్-6లో నిలిచి నేరుగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. స్టాండింగ్స్‌లో నీరజ్ 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది డైమండ్ లీగ్‌లో దోహా, లుస్సాన్నె ఈవెంట్లలో మాత్రమే బరిలోకి దిగడు. రెండు ఈవెంట్లలోనూ రెండో స్థానంలో నిలిచి 14 పాయింట్లు సాధించాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్(29 పాయింట్లు) అగ్రస్థానంలో నిలువగా.. జులియన్ వెబెర్(జర్మనీ), జాకుబ్ వడ్లెచ్(చెక్ రిపబ్లిక్), ఆండ్రియన్ మర్దారే(మోల్డోవా), రోడ్రిక్ జెంకీ డీన్(జపాన్) ఫైనల్‌కు అర్హత సాధించారు. అయితే, పారిస్ ఒలింపిక్స్ చాంపియన్, పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఫైనల్‌కు అర్హత సాధించకపోవడం గమనార్హం. కేవలం 5 పాయింట్లతో అతను 8వ స్థానంలో నిలిచాడు. టాప్-6 అథ్లెట్లు మాత్రమే ఫైనల్‌కు చేరుకుంటారు.