మెరిసిన ముంబై బౌలర్లు.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన తమిళనాడు

by Harish |
మెరిసిన ముంబై బౌలర్లు.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన తమిళనాడు
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో తమిళనాడుతో శనివారం ప్రారంభమైన సెమీస్ మ్యాచ్‌ను ముంబై మెరుగ్గా ఆరంభించింది. బౌలర్లు సత్తాచాటడంతో తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. ముంబై బౌలర్ల ధాటికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టును ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిలువరించింది. విజయ్ శంకర్(44), వాషింగ్టన్ సుందర్(43) చెప్పుకోదగ్గ పరుగులు చేయగా.. మిగతా వారు తేలిపోయారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే(3/24) సత్తాచాటగా.. శార్దూల్ ఠాకూర్, ముషీర్ ఖాన్, తనుష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ముంబై ఆట ముగిసే సమయానికి 2 వికెట్లను కోల్పోయి 45 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్(24 బ్యాటింగ్), మోహిత్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు వెనుకబడి ఉన్నది.

అవేశ్ ఖాన్‌కు 4 వికెట్లు

విదర్భతో శనివారం మొదలైన మరో సెమీస్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ (4/49) సత్తాచాటాడు. అతనికితోడు వెంకటేశ్ అయ్యర్, కుల్వంత్ ఖెజ్రోలియా రెండేసి వికెట్లు తీయడంతో మధ్యప్రదేశ్ మొదటి రోజే కుప్పకూలింది. 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్(63) అర్ధ శతకంతో రాణించగా.. మిగతా వారు విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్ తొలి రోజు ఆట ముగిసే సరికి 47/1 స్కోరుతో నిలిచింది. హిమాన్సు(26 బ్యాటింగ్), హర్ష్ గావ్లీ(10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed