ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై క్లోజ్ ఫ్రెండ్ హింట్

by Harish |
ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై  క్లోజ్ ఫ్రెండ్ హింట్
X

దిశ, స్పోర్ట్స్ : గత రెండు మూడు సీజన్లుగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ‘ధోనీకి ఇదే చివరి సీజన్’ అన్న చర్చ జరగడం కామన్ అయిపోయింది. ఈ సారి కూడా ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయి. అయితే, ధోనీ క్లోజ్ ఫ్రెండ్ పరమ్‌జిత్ సింగ్ ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరమ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ..ధోనీకి ఇది చివరి సీజన్ కాదని తెలిపాడు. ‘అతను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. అతనికి ఇది చివరి సీజన్ అవుతుందని నేను అనుకోను. ధోనీ ఒకటి లేదా రెండు సీజన్లు ఆడతాడని అనుకుంటున్నా. కచ్చితంగా ఒక్క సీజన్ అయితే ఆడతాడు. ఎందుకంటే, అతను ఫిట్‌గా ఉన్నాడు.’ అని వ్యాఖ్యానించాడు.

ధోనీ నాయకత్వంలో గతేడాది చెన్నయ్ సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ఎగరేసుకపోయిన విషయం తెలిసిందే. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్-2024 ప్రారంభం కానుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నయ్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లోనే రెండు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లు ఎదురుపడుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story