- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధోని నాకో విషయం చెప్పాడు.. సీఎస్కేని ఆ మంత్రాతోనే ఓడించా- స్టోయినీస్
దిశ, స్పోర్ట్స్: చెన్నైపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల ఛేదించి.. మరో 3 బంతులు ఉండగానే విజయం సాధించింది లక్నో. 63 బంతుల్లో 124 పరుగులతో అజేయంగా నిలిచిన మార్కస్ స్టోయినిస్.. ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. అయితే గతంలో ఎంఎస్ ధోని చెప్పిన మంత్రానే తనకు ఉపయోగపడిందన్నాడు లక్నో బ్యాటర్ స్టోయినిస్. ఆ వీడియోను ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఆ వీడియోలో స్టోయినిస్ మాట్లాడుతూ.. భారీ లక్ష్యాలను ఛేదించేందుకు ధోని ఇచ్చిన సూచనలు గ్రేట్ అని కొనియాడాడు. పెద్ద లక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు.. అలాంటి సమయంలో ఎలా ఆలోచిస్తామనేది చాలా ముఖ్యమనేది నేర్చుకున్నా అన్నాడు. క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ అదనంగా ఏదైనా చేయాలనుకుంటారని వివరించాడు. విభిన్నంగా ఆడాలి అనుకుంటూ ఉంటారని తెలిపాడు. కానీ, ధోనీ మాత్రం వేరుగా ఆలోచిస్తాడని అన్నాడు. క్లిష్ట సమయాల్లో తనను తాను మోటివేట్ చేసుకునే విధానం బాగుంటుందన్నాడు. క్రీజ్ లో స్టేబుల్ గా ఉండాలని అనుకుంటాడని.. అందరూ మారతారు.. కానీ తాను మాత్రం మారనని అనుకుంటాడని పేర్కొన్నాడు. అందరికంటే.. తానే ముందుండాలని ధోనీ అనుకుంటాడని అసలు విషయాన్ని వివరించాడు స్టోయినీస్.