- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెంపుడు కుక్కలతో ధోని బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్ ధోని.. పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ కు ఎనలేని పేరుప్రతిష్టలు తీసుకొచ్చిన ధోని.. నిన్న (జులై 7) 42వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన తన బర్త్ డేను పెంపుడు కుక్కలతో సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఇంటి ముందు మైదానంలో ఓ టేబుల్ పై కేక్ పెట్టిన ధోని.. నాలుగు కుక్కల సమక్షంలో ఆ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఒక్కో కుక్కకు ఆ కేక్ ముక్కలను అందించారు. కాగా ఈ వీడియోను జాన్స్ అనే ధోని ఫ్యాన్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.
దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు ధోనిని ప్రశంసలతో ముంచెత్తున్నారు. సింప్లిసిటీ, హ్యామానిటీకి ధోని నిలువెత్తు నిదర్శనమని పొగడ్తలు గుప్పిస్తున్నారు. కాగా ఐపీఎల్ లో చెన్నైకి కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న ధోని.. ఆ జట్టును ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిపారు. మరో ఐదు సార్లు సీఎస్కే రన్నరప్ గా నిలిచింది. ఇక ధోని నాయకత్వంలో భారత్ జట్టు వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు పలు సిరీసుల్లో విజేతగా నిలిచింది.