- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IPL 2025: ఈ సారి ఐపీఎల్ వేలంలో నిలిచిన అతి చిన్న, పెద్ద వయస్కులెవరో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025లో టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఐపీఎల్‌లో దాదాపు దశాబ్ద కాలం తర్వాత అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా కంబ్యాక్ ఇస్తున్నాడు ఓ సీనియర్ లెజెండ్. వీళ్లిద్దరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఐపీఎల్ 2025 వేలం జరగబోతోంది. ఈ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1574 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో నుంచి 1000 మంది పేర్లను ఐపీఎల్ మేనేజ్‌మెంట్ తొలగించింది.
మిగిలిన 574 మంది వేలంలో పాల్గొంటారు. వీళ్లలో 366 మంది ఇండియన్స్ కాగా.. 208 మంది విదేశీయులు ఉన్నారు. అయితే ఈ ఏడాది మెగా వేలంలో టీంలకు కేవలం 204 మందిని మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంది. అంటే మొత్తం 574 మందిలో 370 మంది వేలంలో మిగిలిపోనున్నారు. ఇక వీరిలో అత్యంత చిన్న వయస్కుడిగా బిహార్‌కి చెందిన డొమెస్టిక్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. సూర్యవంశీ వయసు నేటికి (నవంబర్ 16, 2024) కేవలం 13 ఏళ్ల 274 రోజులు మాత్రమే కావడం విశేషం. బిహార్ తరపున డొమెస్టిక్ క్రికెట్లో మెరుస్తున్న ఈ చిచ్చర పిడుగు 2011, మార్చి 27న జన్మించాడు.
ఇక ఈ వేలంలో అత్యంత పెద్ద వయస్కుడిగా 42 ఏళ్ల ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఉన్నాడు. 2014 తర్వాత ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైన ఆండర్సన్ మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చాడు. ఈ మధ్యనే అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఆండర్సన్ ఇకపై ఇలంటి టోర్నీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడట.
మరి ఈ ఇద్దరినీ ఏ ఫ్రాంచైజీలైనా దక్కించుకుంటాయో లేదో చూడాలి. ప్రస్తుతం ఫ్రాంచైజీల దగ్గర మొత్తంగా రూ.641 కోట్లున్నాయి. కాబట్టి ఈ డబ్బులను ఆచి తూచి ఫ్రాంచైజీలు ఖర్చుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్లిద్దరినీ ఏవైనా ఫ్రాంచైజీలు కొనుక్కుంటాయా..? లేదా..? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
🚨 NEWS 🚨
— IndianPremierLeague (@IPL) November 15, 2024
TATA IPL 2025 Player Auction List Announced!
All the Details 🔽 #TATAIPLhttps://t.co/QcyvCnE0JM