- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మహ్మద్ షమీకి కాస్త సమయం ఇవ్వాలి
![మహ్మద్ షమీకి కాస్త సమయం ఇవ్వాలి మహ్మద్ షమీకి కాస్త సమయం ఇవ్వాలి](https://www.dishadaily.com/h-upload/2025/01/29/416266-mohammed-shami-291446504-16x90-1.webp)
- రెండు మ్యాచులు ఆడితే రిథమ్ వస్తుంది
- షమీ ఫిట్‌గా ఉన్నాడు
- మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
దిశ, స్పోర్ట్స్:
టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీకి మరి కొంత సమయం ఇవ్వాలి. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన షమీ, తిరిగి తన రిథమ్‌ను పట్టుకోవడానికి సమయం పడుతుందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఫిబ్రవరి నెలలో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ షమీని ఎంపిక చేసింది. అయితే ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా షమీకి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కూడా చోటు కల్పించింది. టీ20 సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు ఆడని షమీ.. మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేసి వికెట్లేమీ తీయకుండా 25 పరుగులు చేశాడు. షమీ బౌలింగ్ తీరుపై పలు విమర్శలు వస్తుండగా అంబటి రాయుడు అతడికి మద్దతుగా నిలిచాడు. సుదీర్గకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండి వచ్చే ఏ క్రికెటర్‌కు అయినా ఇలాంటి ఇబ్బందులు తప్పవని రాయుడు అన్నాడు. గాయం నుంచి కోలుకొని వచ్చాక శరీర కదలికల్లో మార్పులు ఉంటాయి. దాన్ని సరి చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందని రాయుడు అన్నాడు. గతంలో ఉన్న ఫామ్ ఇప్పుడు పనికి రాదని, మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందేనని పీయుష్ చావ్లా చెప్పాడు. షమీ మూడు ఓవర్లు ఎలాంటి గందరగోళం లేకుండా వేశాడు. అతడి బాడీ ఫిట్‌నెస్ బాగుంది. రెండు మ్యాచ్‌లు అవకాశం ఇస్తే తప్పకుండా రిథమ్ పట్టుకుంటాడని పీయుష్ చావ్లా అభిప్రాయపడ్డాడు.