Messi : బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ నామినేట్.. రొనాల్డొకు ఫిఫా బిగ్ షాక్

by Sathputhe Rajesh |
Messi : బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ నామినేట్.. రొనాల్డొకు ఫిఫా బిగ్ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా ప్రతిష్టాత్మక 2024 బెస్ట్ ఫుట్‌బాల్ అవార్డుల్లో నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. క్లబ్, అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలు, పురుషులను ఎంపిక చేసింది. మెస్సీ ఫిఫా అవార్డులకు నామినేట్ అయ్యాడు. అతని చిరకాల ప్రత్యర్థి రొనాల్డొను మాత్రం తాజా అవార్డులకు ఫిఫా నామినేట్ చేయకపోవడం గమనార్హం. రొనాల్డొతో పాటు ఫామ్‌లో ఉన్న మహమ్మద్ సలా సైతం బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డుకు నామినేట్ కాలేదు. ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రోడ్రి, విన్సియస్ జూనియర్ బలమైన కంటెండర్లుగా ఫిఫా బెస్ట్ అవార్డులకు నామినేటెడ్ అయ్యారు. ఆన్ ఫీల్డ్ విజయాలు, ఆఫ్ ఫీల్డ్ డ్రామాతో మాంచెస్టర్ సిటీ మ్యాస్ట్రో రోడ్రి బలమైన పోటీదారుడిగా అవార్డుకు నామినేట్ అయ్యాడు. వరుసగా నాలుగో ప్రీమియర్ లీగ్ టైటిల్ మరియు యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ విజయంతో ఈ స్పెయిన్ ఆటగాడు రేసులో నిలిచాడు. రోడ్రి అద్భుతమైన ప్రదర్శనలు స్పెయిన్‌ యూరోపియన్ ఛాంపియన్‌షిప్ విజయానికి చేర్చాయి. అక్కడ అతను టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ అవార్డుల ఎంపికను ఫ్యాన్స్ ఓటింగ్, ప్రస్తుత కెప్టెన్లు, కోచ్‌లు, మహిళ, పురుషుల జట్లు, మీడియా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత చేపట్టనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ అవార్డులను ఫిఫా అందించనుంది. ఈ కార్యక్రమానికి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. అయితే డిసెంబర్ 10 వరకు ఫ్యాన్స్ తమకు నచ్చిన ఆటగాళ్లకు ఓటింగ్ చేసే వెసులుబాటును ఫిఫా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కల్పించింది.

Advertisement

Next Story

Most Viewed