ప్రపంచ కప్ గెలిచిన జట్టు, సిబ్బంది కోసం 35 బంగారు ఐఫోన్‌లను కొన్న మెస్సీ

by Mahesh |
ప్రపంచ కప్ గెలిచిన జట్టు, సిబ్బంది కోసం 35 బంగారు ఐఫోన్‌లను కొన్న మెస్సీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022 విజేతగా ఆర్జెంటీనా గెలుపొందిన విషయం మన అందరికి తెలిసిందే. కాగా ఆ జట్టు కెప్టెన్ అయిన లియోనెల్ మెస్సీ తమ ప్రపంచ కప్ గెలిచిన జట్టు, సిబ్బంది కోసం సుమారు ₹1.73 కోట్లతో భారీ బహుమతులు కొన్నాడు. మెస్సీ ఏకంగా 35 బంగారం ఐ ఫోన్లను 24 క్యారెట్ల బంగారం తో ప్రత్యేకంగా ఐ ఫోన్‌లను కొనుగోలు చేశాడు. ఆ బంగారు ఐ ఫోన్‌లపై ఆర్జెంటీనా లోగోను ముద్రించారు. అలాగే ఆటగాళ్ల ఫోన్‌లలో వారి పేర్లు, నెంబర్లు ఉంటాయి. కాగా 2022 వరల్డ్ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా మూడో ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Advertisement

Next Story