- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కింగ్ కోహ్లికి పర్‌ఫెక్ట్‌గా సూటైన మెగాస్టార్ డైలాగ్
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఈ ఏడాదిని టీ20 సిరీస్ విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీనియర్లు లేకుండానే టీ20 సిరీస్ ఆడిన టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మంగళవారం జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆడేందుకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇప్పటికే గువహటి చేరుకున్నారు. ఈ మ్యాచ్ ప్రసారాలు స్టార్ స్టోర్ట్స్ తెలుగులో కానున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆసక్తికర పోస్ట్ చేసింది. విరాట్ కోహ్లి మంగళవారం జరిగే వన్డేలో ఆడనుండటంతో వాల్తేరు వీరయ్య పోస్టర్‌కు విరాట్ ఫేస్‌ను జత చేసి తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. 'రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి! కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్!!' అంటూ ట్వీట్‌కు కామెంట్‌ను జత చేసింది. తొలి వన్డే మ్యాచ్ రేపు మధ్యాహ్నం 12: 30 కి ప్రారంభం కానుంది. కాగా ఆ డైలాగ్‌తో పాటు పోస్టర్ నెట్టింట సందడి చేస్తోంది.