Manu bhaker : పారిస్ ఒలిపింక్స్‌లో మను బాకర్‌కు తృటిలో చేజారిన మరో పతకం

by Sathputhe Rajesh |
Manu bhaker :  పారిస్ ఒలిపింక్స్‌లో మను బాకర్‌కు తృటిలో చేజారిన మరో పతకం
X

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో మనుబాకర్‌కు తృటిలో మరో పతకం చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో నాలుగో స్థానంలో మనుబాకర్ నిలిచారు. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే మను బాకర్ రెండు కాంస్యాలు సాధించారు. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి మను బాకర్ కాంస్యం సాధించారు. ఆ తర్వాత మరో షూటర్ సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల మిక్స్‌డ్‌లో కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

Advertisement

Next Story