లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషభ్ పంత్

by D.Reddy |   ( Updated:2025-01-20 10:31:13.0  )
లక్నో  సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషభ్ పంత్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ యాజమాని సంజీవ్ గోయెంకా సోమవారం అధికారికంగా వెల్లడించారు.

2016లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన పంత్ ఢిల్లీ జట్టుకు ఎంపికై.. గతేడాది వరకు ఆ టీమ్‌తోనే పనిచేశాడు. 2021 నుంచి 22 వరకు DC కెప్టెన్‌గా వ్యవహారించాడు. అనంతరం గాయం కారణంగా 23 ఎడిషన్‌లో పగ్గాలు చేపట్టలేదు. గతేడాది కూడా ఢిల్లీకి నాయకత్వం వహించాడు. ఇక ఇప్పటివరకూ ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన పంత్.. 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Next Story

Most Viewed