- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మెస్సీకి అరుదైన గౌరవం.. మూడో ఆటగాడిగా..
by Vinod kumar |

X
బ్యూనస్ ఎయిర్స్: దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ నాయకత్వంలో గతేడాది అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన మెస్సీపై ఇప్పటికీ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ గవర్నింగ్ కౌన్సిల్ మెస్సీని అరుదైన గౌరవంతో సత్కరించింది. తమ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించినందుకు మెస్సీని ఈ గౌరవంతో సత్కరించినట్టు గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. కాన్‌మిబోల్ మ్యూజియంలో దిగ్గజాలు డీరో మారడోనా, పీలే తర్వాత ఈ గౌరవం అందుకున్న మూడో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు.
Next Story