- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ తర్వాత ఎవరు?.. సీఎస్కే ఓనర్ ఏమన్నారంటే?
దిశ, స్పోర్ట్స్ : గత రెండు మూడు సీజన్లుగా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోనీ రిటైర్మెంట్ గురించి, ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎవరు? అన్న దాని గురించి చర్చ జరగడం కామన్ అయిపోయింది. దీనిపై తాజాగా చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఈ విషయంపై మేనేజ్‌మెంట్ చర్చలు జరిపిందని, ఫ్రాంచైజీ యజమాని శ్రీనివాసన్ స్పష్టమైన వైఖరిని కలిగి ఉన్నారని తెలిపారు. ‘కెప్టెన్, వైస్ కెప్టెన్ నియామకాల గురించి మాట్లాడొద్దని అంతర్గత చర్చల్లో శ్రీనివాసన్ స్పష్టంగా చెప్పారు. ఆ విషయాన్ని కెప్టెన్, కోచ్‌లకే వదిలేద్దామన్నారు. వాళ్లు నిర్ణయం చెప్పే వరకూ మౌనంగా ఉండాలని చెప్పారు.’ అని విశ్వనాథన్ తెలిపారు. అలాగే, ఈ సీజన్‌కు జట్టు సన్నద్ధతపై మాట్లాడుతూ..‘‘ప్రతి సీజన్‌కు ముందు ధోనీ మాకు చెప్పేదే ఒక్కటే. ముందు లీగ్ గేమ్స్‌పై ఫోకస్ పెట్టి నాకౌట్‌కు అర్హత సాధిద్దామని చెబుతాడు.’ అని తెలిపారు. కాగా, డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ ఈ నెల 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.