క్రికెట్‌లో అది సాధారణమే : Kuldeep Yadav

by Vinod kumar |
క్రికెట్‌లో అది సాధారణమే : Kuldeep Yadav
X

బ్రిడ్జ్‌టౌన్ : వెస్టిండీస్‌‌తో తొలి వన్డే‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడు ఓవర్లు వేసిన అతను 4 వికెట్లు తీయడంతో 6 పరుగులు మాత్రమే ఇచ్చి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో కుల్దీప్ చాలాసార్లు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీనిపై కుల్దీప్ స్పందిస్తూ.. ‘సందర్భం, టీమ్ కాంబినేషన్‌ల కారణంగా చాలా సార్లు నేను ఆడలేకపోయా. అది క్రికెట్‌లో సాధారణంగా జరగుతుంది. నేను సుమారు ఆరేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. ఇవన్నీ చాలా సాధారణమైనవి.’ అని తెలిపాడు.

వికెట్లు తీయడంపై తాను ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదని, సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలనే దానిపై దృష్టి పెట్టినట్టు చెప్పాడు. ‘గాయం నుంచి తిరిగివచ్చిన తర్వాత సుమారు ఏడాదిన్నర కాలంగా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం గురించే ప్రయత్నిస్తున్నా. ఏదో ఒక రోజు వికెట్లు పడతాయి. అయితే, పరిస్థితులు కూడా చాలా ముఖ్యం. ప్రత్యర్తి జట్టు నాలుగు లేదా ఐదు వికెట్లు త్వరగా కోల్పోయినప్పుడు మాత్రమే నా వేరియేషన్స్ ట్రై చేస్తాను.’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story