ఓ ఇంటివాడైన వెంకటేశ్ అయ్యర్

by Harish |
ఓ ఇంటివాడైన వెంకటేశ్ అయ్యర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు శృతి రఘనాథన్‌‌ను వివాహమాడాడు. ఆదివారం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. దక్షిణ భారత సంప్రదాయ పద్ధతిలో వెంకటేశ్, శృతి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతేడాది నవంబర్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంకటేశ్ అయ్యర్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వెంకటేశ్ అయ్యర్‌కు ఈ ఏడాది గుర్తుండిపోనుంది. ఇటీవల ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అతను సత్తాచాటిన విషయం తెలిసిందే. కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. క్వాలిఫయర్-1లో, ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో వెంకటేశ్ 13 ఇన్నింగ్స్‌ల్లో 370 పరుగులు చేశాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమ్ ఇండియా తరపున 9 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. మరోవైపు, కర్ణాటకకు చెందిన శృతి బీ.కామ్ పూర్తయ్యాక నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తోంది.

Advertisement

Next Story