- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KKR:కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గా సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్..?
దిశ, వెబ్‌డెస్క్:ఐపీఎల్ -2024(IPL 2024) సీజన్ ఫైనల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విజయం సాధించిన సంగతి తెలిసిందే.గత సీజన్లో గౌతమ్ గంభీర్(Gautam Gambhir) కోల్‌కతా మెంటార్ గా బాధ్యతలు నిర్వహించాడు. అయితే కొన్ని నెలల క్రితం గంభీర్ కోల్‌కతా మెంటార్ పదవి వదులుకొని టీంఇండియా హెడ్ కోచ్ గా వచ్చాడు. దీంతో కోల్‌కతా జట్టు లో మెంటార్ పోస్ట్ ఖాళీ అయ్యింది.ఇక ప్రస్తుతం ఖాళీగా ఉన్న మెంటార్ పోస్టును జట్టు యజమాని షారుక్ ఖాన్(Shah Rukh Khan) ఓ మాజీ ఆల్ రౌండర్ తో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్నో(Lucknow), రాజస్థాన్(Rajasthan) టీం లు తమ కొత్త మెంటార్, కోచ్ ను ప్రకటించాయి.అయితే కోల్‌కతా కూడా కొత్త మెంటార్ ను నియమించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా రికీ పాంటింగ్(Ricky Ponting), కుమార సంగక్కర(Kumar Sangakkara) పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో మాజీ ఆల్రౌండర్ పేరు స్పోర్ట్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు KKR జట్టులో సభ్యుడు..
కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గా సౌతాఫ్రికా(South Africa) దిగ్గజం జాక్వెస్ కలిస్(Jacques Kallis) ను ఎంపిక చేయాలని ఆ ప్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కోల్‌కతాతో కలిస్ కు మంచి అనుబంధం ఉంది.అతడు గంభీర్ సారథ్యములో KKR తరుపున ఆడాడు. అలాగే ఆ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ గానూ సేవలందించారు. అందుకే అతడిని మెంటార్ గా నియమించుకోవాలని KKR యాజమాన్యం భావిస్తోంది
చర్చలు పూర్తి..
ఇప్పటికే KKR యాజమాన్యం అతనితో చర్చలు జరిపిందని, త్వరలోనే అతడి నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ గా కలిస్ కు మంచి పేరుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో కలిస్ కు తిరుగులేదు. అతడి ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు మరోసారి విజేతగా ఆవిర్భవిస్తుందని షారుఖ్ ఖాన్ బలంగా నమ్ముతున్నాడు. అందువల్లే అతడిని మెంటార్ గా తీసుకోవాలని ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బహుశా అతడి అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో రాబోతుందని KKR ప్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి.