- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో టెస్టుకు అందుబాటులోకి హేజల్‌వుడ్.. ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే
దిశ, స్పోర్ట్స్ : భారత్‌తో మూడో టెస్టుకు ఆసిస్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ అందుబాటులోకి వచ్చాడు. నేటి నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో బరిలోకి దిగే ఆసిస్ తుది జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. తొలి టెస్టులో హేజల్‌వుడ్ సత్తాచాటాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, గాయం కారణంగా అతను రెండో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ మ్యాచ్‌కు నాటికి పూర్తిగా కోలుకోవడంతో అతను తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో మరో పేసర్ స్కాట్ బోలాండ్ తుది జట్టులో చోటు కోల్పోయాడు. తుది జట్టులో ఆసిస్ ఈ ఒక్క మార్పు మాత్రమే చేసింది. పెర్త్‌లో ఓడిన ఆస్ట్రేలియా అడిలైడ్‌లో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్రిస్బేన్ గెలవడం ద్వారా ఆధిక్యంలోకి వెళ్లాలని ఆ జట్టు భావిస్తున్నది.
ఆస్ట్రేలియా తుది జట్టు : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్స్, అలెక్స్ కేరీ, కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, హేజల్‌వుడ్.