- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొనసాగుతున్న తెలుగు టైటాన్స్ ఓటమి పరంపర.. వరుసగా ఆరో పరాజయం
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి పరంపర కొనసాగుతోంది. వరుసగా 6వ ఓటమిని చవిచూసింది. జైపూర్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో 38-35 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌కు చెత్త ఆరంభం దక్కింది. మొదటి నుంచి తేలిపోయిన ఆ జట్టు పాయింట్ల వేటలో వెనుకబడింది. మరోవైపు, జైపూర్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. రెండుసార్లు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. దీంతో ఫస్టాఫ్ ముగిసే సరికి 27-8 తేడాతో జైపూర్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ బలంగా పుంజుకుంది. జైపూర్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసి పోటీలోకి వచ్చింది. అయితే, జైపూర్ చివరి వరకూ ఆధిక్యతను కాపాడుకుని విజేతగా నిలిచింది. జైపూర్ తరపున రైడర్ అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టైటాన్స్ తరపున కెప్టెన్ పవన్(12 పాయింట్లు) వృథా అయ్యింది. లీగ్‌లో ఇప్పటివరకు తెలుగు టైటాన్స్ 12 మ్యాచ్‌లు ఆడగా.. ఒక విజయం మాత్రమే నమోదు చేయగా 11 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ వరుస విజయాలతో రెండో స్థానంలో ఉన్నది. ఇక, లీగ్‌లో పుణేరి పల్టాన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌ను 17-37 తేడాతో చిత్తు చేసి వరుసగా 8 విజయం నమోదు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.