IND VS SL : రోహిత్, కోహ్లీ విషయంలో ఆ అవసరం లేదు.. గంభీర్‌పై ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్

by Harish |
IND VS SL :  రోహిత్, కోహ్లీ విషయంలో ఆ అవసరం లేదు.. గంభీర్‌పై ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాటజీపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. వన్డే సిరీస్‌‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆడించడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మొదట వన్డే సిరీస్‌కు రోహిత్, విరాట్ విశ్రాంతి కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే, వారు ఆడాల్సిందేనని గంభీర్ పట్టుబట్టినట్టు తెలిసింది.

తాజాగా ఓ జాతీయ మీడియాతో నెహ్రా మాట్లాడుతూ..‘రెండు, మూడు నెలల తర్వాత భారత్ తర్వాతి సిరీస్ ఆడుతుంది. ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. కాబట్టి, ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయర్ల స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వాల్సింది. గంభీర్ కొత్త కోచ్ అని నాకు తెలుసు. అనుభవజ్ఞులతో అతను సమయం గడపాలని అనుకుని ఉండొచ్చు. కానీ, అతను విదేశీ కోచేం కాదు. రోహిత్, కోహ్లీ గురించి అతనికి తెలుసు. కాబట్టి, కొత్త ప్లేయర్లకు చాన్స్ ఇవ్వడానికి ఇదే మంచి అవకాశం. రోహిత్, కోహ్లీ హోం సీజన్‌లో ఆడొచ్చు. గంభీర్‌ను తప్పుబట్టడం లేదు. కానీ, ఈ సిరీస్‌లో అలా జరిగి ఉంటే బాగుండేది.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ టై అవ్వగా.. రెండో మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే. సిరీస్‌లో ప్రస్తుతం శ్రీలంక 1-0తో ఆధిక్యంలో ఉన్నది. బుధవారం జరిగే ఆఖరిదైన మూడో వన్డే‌లో గెలిచి సిరీస్ సమయం చేయాలని రోహిత్ సేన భావిస్తున్నది.

Advertisement

Next Story