లంక ప్రీమియర్‌ లీగ్‌లో మరోసారి పాము హల్‌ చల్‌.. వీడియో వైరల్

by Vinod kumar |
లంక ప్రీమియర్‌ లీగ్‌లో మరోసారి పాము హల్‌ చల్‌.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: లంక ప్రీమియర్‌ లీగ్‌లో మరోసారి పాము కలకలం రేపింది. నిన్న (ఆగస్ట్‌ 12) ​కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్‌, బి లవ్‌ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్‌చల్‌ చేసింది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్‌ ప్రదీప్‌ బౌలింగ్‌ చేసే ముందు ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు.

ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. లీగ్‌లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్‌ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్‌ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

Advertisement

Next Story

Most Viewed