IPL.. CSK అభిమానులకు షాక్..

by Mahesh |
IPL.. CSK అభిమానులకు షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL మార్చి 31 ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా ఈ సీజన్ లో దాదాపు అన్ని జట్లు హాట్ ఫేవరేట్ గానే బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లోని కీలక మ్యాచులకు దూరం కానున్నాడు. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జేమిసన్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇంతలోనే స్టోక్స్ కీలకమైన మ్యాచులకు దూరం అవుతాడని తెలియడంతో చెన్నై అభిమానుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తుంది.

జూన్ 1 నుంచి ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. దీనికి స్టోక్స్ కెప్టెన్సీ వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతను టెస్టుకు ముంది. తగినంత సమయం తీసుకుంటానని ప్రకటించాడు. అయితే మే 28న ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులకు చెన్నై చేరితే స్టోక్స్ వాటికి దూరం అయ్యే అవకాశం ఉంది.

ఇలా జరిగితే అది చెన్నై జట్టుకు భారీ నిరాశగా నిలుస్తుంది. ఎందుకంటే స్టోక్స్ కీలక సమయాల్లో ఆటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో రాణించగలడు. ఎవరు ఊహించని సమయంలో కూడా జట్టును గెలిపించ సత్తా గలవాడు. అందుకే అతనికి చెన్నై జట్టు రూ. 16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

Advertisement

Next Story