- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్‌కు పోటీనే లేదు : ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్
న్యూఢిల్లీ: భారత టీ20 లీగ్‌కు వరల్డ్‌లోనే ఏ టీ20 క్రికెట్ లీగ్ కూడా పోటీ ఇవ్వదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ తెలిపారు. తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై స్పందించారు. వివిధ దేశాల్లో ఆయా క్రికెట్ బోర్డులు టీ20 క్రికెట్ లీగ్స్‌ను తీసుకరావడంపై ఆయన స్పందిస్తూ.. ‘మాకు పోటీ మరొకరిని చూడలేం. ఐపీఎల్ దరిదపుల్లో కూడా లేరు. ఇతర టీ20 లీగ్‌ల నుంచి ఐపీఎల్‌కు ఎలాంటి నష్టం లేదు’ అని తెలిపారు.
‘జట్ల మధ్య తీవ్ర పోటీ కారణంగా ఐపీఎల్-16 అసాధారణ విజయం సాధించింది. చాలా మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకూ వెళ్లడంతో అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది.’ అని చెప్పుకొచ్చారు. అలాగే, ఐపీఎల్ 10 జట్ల లీగ్‌గానే కొనసాగుతుందని, కానీ మ్యాచ్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ధుమాల్ తెలిపారు. ‘ప్రస్తుత సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరిగాయి. ఐసీసీ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు పెద్ద విండో లభిస్తే 94 మ్యాచ్‌లు నిర్వహించే చాన్స్‌లు ఉన్నాయి’ అని చెప్పారు.