- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేకేఆర్ పగ్గాలు చేపట్టడానికి నేను సిద్ధమే.. స్టార్ ఆల్‌రౌండర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)ను నడపించడానికి తాను సిద్ధమేనని ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. గత సీజన్‌లో టైటిల్ అందించిన విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఫ్రాంచైజీ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఇంకా ఆ జట్టు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించలేదు. వెంకటేశ్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన వెంకటేశ్.. కెప్టెన్సీ చేపట్టడానికి తాను రెడీగా ఉన్నానని చెప్పాడు. ‘కచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను. మళ్లీ మళ్లీ ఇదే చెబుతాను. కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్ మాత్రమే. లీడర్‌షిప్‌ను నేను నమ్ముతాను. లీడర్‌గా ఉండటం పెద్ద పాత్ర. కేకేఆర్ కెప్టెన్‌గా చేయాలని అడిగితే కచ్చితంగా చేస్తాను. వద్దనడానికి కారణం ఏం లేదు. డ్రెస్సింగ్ రూంలో నాయకుడిగా ఉండటానికి కెప్టెన్ ట్యాగ్ అవసరం లేదు. మైదానం లోపల, బయట రోల్‌గా ఉండాలి. మధ్యప్రదేశ్ జట్టులో నేను అదే చేస్తున్నా. మధ్యప్రదేశ్‌కు నేను కెప్టెన్ కాదు. కానీ, నా అభిప్రాయాలను గౌరవిస్తారు. మన అభిప్రాయాలను తెలియజేయడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అని వెంకటేశ్ చెప్పుకొచ్చాడు.