- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకోవాలి: మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్
దుబాయ్: ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటంపై క్రికెట్‌లో చట్టాలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఫ్రాంచైజీ క్రికెట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు ముప్పు పొంచి ఉందని, అంతర్జాతీయ క్రికెట్‌కు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. ఈ విషయంలో ఐసీసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది.
శుక్రవారం దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీతో ఎంసీసీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఫ్రాంచైజీ క్రికెట్ పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎంసీసీ.. డొమెస్టిక్ లీగ్‌లను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. ‘ఫ్రాంచైజీ క్రికెట్‌తో ఐసీసీ ఫూచర్ టూర్ ప్రొగ్రామ్స్‌పై ప్రభావం పడుతుంది. ఇప్పటికే 2023 ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లతో నిండిపోయింది. ఈ లీగ్‌ల్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు చెందినవే అగ్రభాగం ఉన్నాయి. ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ, ఐసీసీలోని అసోసియేట్ దేశాలు సహా అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు నష్టపోతాయి’ అని ఎంసీసీ తెలిపింది.
డొమెస్టిక్స్ లీగ్‌లో ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని చెప్పింది. అనంతరం వరల్డ్ క్రికెట్ కమిటీ సభ్యుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. టెస్టులు, ఫ్రాంచైజీ క్రికెట్ మధ్య బ్యాలెన్సింగ్ చేయడం అత్యవసరమని తెలిపాడు. ‘క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్ బిగ్గెస్ట్ ప్లాట్‌ఫమ్. సుదీర్ఘ ఫార్మాట్ నుంచే గొప్ప ఆటగాళ్లు వస్తారు. నైపుణ్యాలకు పరీక్ష కాబట్టే దీన్ని టెస్ట్ అంటారు. ఫ్రాంచైజీ క్రికెట్, టెస్ట్ క్రికెట్ మధ్య సమతుల్యత కోసం దేశాలు ముందుకొస్తాయని భావిస్తున్నాను’ అని గంగూలీ తెలిపాడు.