India A vs Australia A : తీరుమారని ఇండియా ఏ ఆట తీరు..రెండో ఇన్నింగ్స్ లోనూ తడబాటు

by Y. Venkata Narasimha Reddy |
India A vs Australia A : తీరుమారని ఇండియా ఏ ఆట తీరు..రెండో ఇన్నింగ్స్ లోనూ తడబాటు
X

దిశ, వెబ్ డెస్క్ : అస్ట్రేలియా ఏ(Australia A) జట్టుతో రెండో అనధికారిక టెస్టు(2nd unofficial Test)లో ఇండియా ఏ(India A) జట్టు ఆటగాళ్లు తడబాటు కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఏ జట్టు 161పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లోనూ 73పరుగులకే 5 ప్రధాన బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి( 9), దృవ్ జురెల్( 19)పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ స్కోరు ఆధారంగా ఇండియా ఏ 11పరుగుల ఆధిక్యతలో కొనసాగుతోంది. అంతకుముందు అస్ట్రేలియా ఏ జట్టు 223పరుగులకు అలౌట్ అవ్వడంతో ఇండియాపై 62పరుగుల తొలి ఇన్నింగ్స్ కీలక ఆధిక్యతను సాధించింది. అస్ట్రేలియా బ్యాటర్లలో మార్కస్ 74పరుగులు సాధించాడు.

ప్రసిద్ధ్ కృష్ణ 4, ముకేశ్ కుమార్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు సాధించారు. 62పరుగుల వెనుకబాటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ఏ జట్టు రెండో రోజూ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు చేజార్చుకుని 73పరుగులతో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. టీమిండియా స్టార్ ఆటగాడు కే.ఎల్.రాహుల్(10) పరుగలకే పెవిలియన్ చేరి వరుస వైఫల్యాలను కొనసాగించాడు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (17), రుతురాజ్ గైక్వాడ్(11), దేవదత్ పడిక్కల్(1), సాయి సుదర్శన్(3)లు భారీ స్కోర్ లు సాధించలేకపోయారు.

Advertisement

Next Story

Most Viewed