భారత్ భారీ విక్టరి..

by Mahesh |   ( Updated:2022-12-18 04:39:16.0  )
భారత్ భారీ విక్టరి..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ లో మొదటి టెస్ట్ లో భారత్ భారీ విజయం సాధించింది. మొదటి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసింది. అలాగే రెండో ఇన్నింగ్స్ లో 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా బంగ్లా తన మొదటి ఇన్నింగ్స్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 512 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు 324 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 188 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండు ఇన్నింగ్స్ కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed