భారీ ఆదాయంపై బీసీసీఐ కన్ను.. టైటిల్ స్పాన్సర్ రైట్స్ టెండర్లకు పిలుపు

by Vinod kumar |
భారీ ఆదాయంపై బీసీసీఐ కన్ను.. టైటిల్ స్పాన్సర్ రైట్స్ టెండర్లకు పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ మ‌రోసారి భారీ ఆదాయంపై క‌న్నేసింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్‌కు బీసీసీఐ ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. ప్రముఖ‌ కంపెనీల నుంచి ద‌రఖాస్తులు కోరుతున్నట్టు ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది. జీఎస్టీతో క‌లిపి రూ. ల‌క్ష చెల్లించిన వాళ్లకు మాత్రమే ఇన్విటేష‌న్ టు టెండ‌ర్ ఫామ్ ఓపెన్ అవుతుంద‌ని వెల్లడించింది.

ఒక‌వేళ టెండ‌ర్ ద‌క్కకుంటే క‌ట్టిన డబ్బులు వాప‌సు ఇవ్వబోమ‌ని.. ఈ టెండ‌ర్ ద‌ర‌ఖాస్తు ఆగ‌స్టు 21 వ‌ర‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంద‌ని నోటిఫికేష‌న్‌లో బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. ఆస‌క్తిక‌ల కంపెనీలు పేమెంట్ వివ‌రాల‌ను మెయిల్‌కు చేయాల‌ని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed