ఆసియా గేమ్స్‌కు సాఫ్ట్‌బాల్ జట్టు.. తొలిసారి పాల్గొననున్న మహిళా జట్టు

by Vinod kumar |
ఆసియా గేమ్స్‌కు సాఫ్ట్‌బాల్ జట్టు.. తొలిసారి పాల్గొననున్న మహిళా జట్టు
X

న్యూఢిల్లీ: చైనాలోని హాంగ్ జౌలో జరిగే ఆసియా గేమ్స్‌లో భారత మహిళా సాఫ్ట్‌ బాల్ జట్టు తొలిసారి ఆడనుంది. భారత సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సోమవారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ప్రొబాబుల్స్‌కు ఢిల్లీలో జూన్-జులై నెలల్లో నిర్వహించిన శిక్షణా శిబిరం తర్వాత తుది జట్టును ఎంపిక చేశారు. ఆసియా సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్‌లో భారత మహిళా జట్టు రెగ్యులర్‌గా పాల్గొంటోంది. దీంతో ఆసియా గేమ్స్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఈ ఎంపికతో దేశంలో సాఫ్ట్‌బాల్ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందన్న ఆశాభావాన్ని భారత సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నీతల్ నారంగ్ వ్యక్తం చేశారు. జాతీయ ఛాంపియన్ అయిన మహారాష్ట్రకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు భారత జట్టులో చోటు సంపాదించడం విశేషం.

భారత జట్టు:

ఐశ్వర్య రమేష్ పూరి, ఐశ్వర్య సునీల్ బోడ్కే, మనాలి మాన్ సింగ్ నాతు, సి.స్వప్నాలి, వాయిడ్ నేడ్, సయీ అనిల్ జోషి, అంజలి పల్లికార, స్టెఫీ సాజి, రింటా చెరియన్, మమతా గుగులోత్, గంగా సోనా, మమతా మిన్హాస్, సందీప్ కౌర్, కుమారి మనిషా, ఇషా, స్వేతాసిని సబర్, నిత్య మాల్వి, ప్రియాంక బాఘేల్ (స్టండ్ బై)

Advertisement

Next Story

Most Viewed