పారా ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్

by GSrikanth |
పారా ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులు హస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అదే దారిలోనే చైనాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లోనూ ప్లేయర్లు సత్తా చాటారు. ఈ గేమ్స్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే భారత్ అన్ని కలిపి 73కు పైగా పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ పారా ఏషియన్ గేమ్స్‌లో 100 పతకాలు సాధించి చరిత్ర క్రియేట్ చేశారు. 2018 లో జరిగిన టోర్నీలో భారత్ మొత్తం 72 పతకాలను మాత్రమే అత్యధికంగా గెలుచుకొగలిగింది. అయితే ఇవాళ కూడా మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, పారా ఆసియా గేమ్స్‌లో వంద పతకాలు సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. భారత్ పారా ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed