పూల్-బీలో ఇండియా హాకీ జట్టు

by Swamyn |
పూల్-బీలో ఇండియా హాకీ జట్టు
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన భారత పురుషుల హాకీ జట్టు.. ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఎఫ్‌ఐహెచ్ హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ పూర్తయిన తర్వాత అంతర్జాతీయ హాకీ సమాఖ్య.. పురుషులు, మహిళల హాకీ పోటీల పూల్‌లను తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం, పురుషుల హాకీ పోటీలో కఠినమైన పూల్-బీలో భారత్ నిలిచింది. పూల్-బీలో వరల్డ్ నం.2 అయిన భారత్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, వరల్డ్ నం.2 ఆస్ట్రేలియా, రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్జెంటీనా సహా న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఇక, పూల్-ఏలో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. మరోవైపు, శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన క్వాలిఫయర్స్‌లో జపాన్ చేతిలో 0-1తో ఓడిన భారత మహిళల జట్టు.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదన్న విషయం తెలిసిందే. కాగా, పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. హాకీ పోటీలు జూలై 27న ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తాయి.


Advertisement

Next Story

Most Viewed