- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విండీస్‌తో సిరీస్ షెడ్యూల్ ఖరారు.. జియో సినిమా బంపరాఫర్!
దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023 ముగిసిన అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ కంటే ముందు క్రిక్‌బజ్ ఈ పర్యటన షెడ్యూల్‌ను వెల్లడించింది. రెండు టెస్ట్‌ల సిరీస్.. జూలై 12-16 మధ్య తొలి టెస్ట్, జూలై 20-14 మధ్య రెండో టెస్ట్ జరగనుందని తెలిపింది.
ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ట్రినిడాడ్‌లోని డొమినికా, బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. మూడు వన్డేల సిరీస్.. జూలై 27 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగుతుందని, తొలి వన్డే జూలై 27న, రెండో వన్డే జూలై 29న, మూడో వన్డే ఆగస్టు 1న జరగనుందని క్రిక్ బజ్ తెలిపింది. ఐదు టీ20ల సిరీస్.. ఆగస్టు 4 నుంచి 13వరకు జరగనుంది. తొలి టీ20 ఆగస్టు 4, రెండో టీ20 ఆగస్టు6న, మూడో టీ20 ఆగస్టు 8న, నాలుగో టీ20 ఆగస్టు 12న, ఐదో టీ20 ఆగస్టు 13న జరుగుతుందని పేర్కొంది.
ఈ మూడు సిరీస్‌లను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమా ఉచితంగా ప్రసారం చేయనుంది. టీవీలో భారత ప్రభుత్వానికి చెందిన స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌ను ఫ్రీగా అందించి క్రికెట్ అభిమానులను మనసులను గెలుచుకున్న జియో సినిమా.. ఈ మేరకు వెస్టిండీస్ అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్ ఫ్యాన్ కోడ్‌తో జియో సినిమా ఒప్పందం చేసుకుంది.
విండీస్ బోర్డు ప్రతిపాదించిన షెడ్యూల్ :
జులై 12-16 : ఫస్ట్ టెస్టు - డొమినికా
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్
జులై 27 : ఫస్ట్ వన్డే - బార్బోడస్
జులై 29 : రెండో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 4 : ఫస్ట్ టీ20 - ట్రినిడాడ్
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్)
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా