రెండో టెస్టుకు విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ

by Harish |
రెండో టెస్టుకు విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టుకు విశాఖపట్నం ఆతిథ్యమిస్తున్నది. డాక్టర్ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం‌లో ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు నేడు విశాఖపట్నం చేరుకోనున్నారు. రెండో టెస్టు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం స్టేడియంలో ఏర్పాట్లను ఏసీఏ ట్రెజరర్ ఎ.వి. చలంతో కలిసి ఆయన పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఐదు రోజులపాటు జరిగే మ్యాచ్‌కు 10 వేల మంది విద్యార్థులకు, 14,250 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed