IND VS ENG : భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ విలవిల.. టీ20 సిరీస్ టీమిండియా వశం

by Harish |
IND VS ENG : భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ విలవిల.. టీ20 సిరీస్ టీమిండియా వశం
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ భారత్ కైవసమైంది. నాలుగో టీ20లో గెలుపొంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(53), శివమ్ దూబె(53) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రింకు సింగ్(30), అభిషేక్ శర్మ(29) విలువైన పరుగులు జోడించగా.. శాంసన్(1), తిలక్(0), కెప్టెన్ సూర్యకుమార్(0) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్(51) అర్ధ శతకంతో మెరిసినా.. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. వరుణ్ చక్రవర్తికి రెండు వికెట్లు, అర్ష్‌దీప్, అక్షర్ చెరో వికెట్ తీశారు.

Next Story

Most Viewed